Page 1
Marking Scheme
Strictly Confidential
(For Internal and Restricted use only)
Senior Secondary School Examination, 2024
SUBJECT NAME:Telugu-Telangana SUBJECT CODE 189, PAPER CODE 50
General Instructions: -
1 You are aware that evaluation is the most important process in the actual and correct
assessment of the candidates. A small mistake in evaluation may lead to serious problems
which may affect the future of the candidates, education system and teaching profession. To
avoid mistakes, it is requested that before starting evaluation, you must read and understand
the spot evaluation guidelines carefully.
2 “Evaluation policy is a confidential policy as it is related to the confidentiality of the
examinations conducted, Evaluation done and several other aspects. Its’ leakage to
public in any manner could lead to derailment of the examination system and affect the
life and future of millions of candidates. Sharing this policy/document to anyone,
publishing in any magazine and printing in News Paper/Website etc may invite action
under various rules of the Board and IPC.”
3 Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It should not be
done according to one’s own interpretation or any other consideration. Marking Scheme
should be strictly adhered to and religiously followed. However, while evaluating, answers
which are based on latest information or knowledge and/or are innovative, they may be
assessed for their correctness otherwise and due marks be awarded to them. In class-
XII, while evaluating two competency-based questions, please try to understand given
answer and even if reply is not from marking scheme but correct competency is
enumerated by the candidate, due marks should be awarded.
4 The Marking scheme carries only suggested value points for the answers.These are in the
nature of Guidelines only and do not constitute the complete answer. The students can have
their own expression and if the expression is correct, the due marks should be awarded
accordingly.
5 The Head-Examiner must go through the first five answer books evaluated by each evaluator
on the first day, to ensure that evaluation has been carried out as per the instructions given in
the Marking Scheme. If there is any variation, the same should be zero after delibration and
discussion. The remaining answer books meant for evaluation shall be given only after
ensuring that there is no significant variation in the marking of individual evaluators.
6 Evaluators will mark( √ ) wherever answer is correct. For wrong answer CROSS ‘X” be
marked. Evaluators will not put right (✓)while evaluating which gives an impression that
answer is correct and no marks are awarded. This is most common mistake which
evaluators are committing.
7 If a question has parts, please award marks on the right-hand side for each part. Marks
awarded for different parts of the question should then be totaled up and written in the left-
hand margin and encircled. This may be followed strictly.
8 If a question does not have any parts, marks must be awarded in the left-hand margin and
encircled. This may also be followed strictly.
9 If a student has attempted an extra question, answer of the question deserving more marks
should be retained and the other answer scored out with a note “Extra Question”.
10 No marks to be deducted for the cumulative effect of an error. It should be penalized only
once.
11 A full scale of marks _____80_____(example 0 to 80/70/60/50/40/30 marks as given in
Question Paper) has to be used. Please do not hesitate to award full marks if the answer
deserves it.
Page 2
12 Every examiner has to necessarily do evaluation work for full working hours i.e., 8 hours
every day and evaluate 20 answer books per day in main subjects and 25 answer books per
day in other subjects (Details are given in Spot Guidelines).
13 Ensure that you do not make the following common types of errors committed by the
Examiner in the past:- Giving more marks for an answer than assigned to it.
● Wrong totaling of marks awarded on an answer.
● Wrong transfer of marks from the inside pages of the answer book to the title page.
Wrong question wise totaling on the title page.
● Leaving answer or part thereof unassessed in an answer book.
●
● Wrong totaling of marks of the two columns on the title page.
● Wrong grand total.
● Marks in words and figures not tallying/not same.
● Wrong transfer of marks from the answer book to online award list.
● Answers marked as correct, but marks not awarded. (Ensure that the right tick mark is
correctly and clearly indicated. It should merely be a line. Same is with the X for incorrect
answer.)
● Half or a part of answer marked correct and the rest as wrong, but no marks awarded.
14 While evaluating the answer books if the answer is found to be totally incorrect, it should be
marked as cross (X) and awarded zero (0)Marks.
15 Any un assessed portion, non-carrying over of marks to the title page, or totaling error
detected by the candidate shall damage the prestige of all the personnel engaged in the
evaluation work as also of the Board. Hence, in order to uphold the prestige of all concerned,
it is again reiterated that the instructions be followed meticulously and judiciously.
16 The Examiners should acquaint themselves with the guidelines given in the “Guidelines for
spot Evaluation” before starting the actual evaluation.
17 Every Examiner shall also ensure that all the answers are evaluated, marks carried over to
the title page, correctly totaled and written in figures and words.
18 The candidates are entitled to obtain photocopy of the Answer Book on request on payment
of the prescribed processing fee. All Examiners/Additional Head Examiners/Head Examiners
are once again reminded that they must ensure that evaluation is carried out strictly as per
value points for each answer as given in the Marking Scheme.
Page 3
CENTRAL BOARD OF SECONDARY EDUCATION
CLASS – XII (SSCE) FEBRUARY/MARCH 2024
TELUGU TELANGANA (189) MARKING SCHEME
TIME : 3Hours Max. Marks -80
__________________________________________________________________________
భాగం – A ( Part- A)
(అపరిచిత గద్యాంశముల విభాగం)
1.క్రింది గద్యాంశమును చదివి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు
చొప్పున మొత్తం 5 మార్కులు. 5 x 1 = 5
మొదటి గద్యాంశము జవాబులు
i ) ప్రశ్నతెలుగు ఏ సంస్కృతికి చెందినది?
జవాబు. B) ద్రావిడ సంస్కృతికి చెందినది.
ii) ప్రశ్నతెలుగు జాతి అనేది ఏమిటి?
జవాబు. A) ఒక సముదాయం
iii) ప్రశ్న దేనిమీద అనేక పరిశోధనలు జరిగాయి?
జవాబు. D) తెలుగు భాష
iv)ప్రశ్న మానవుని ఉనికి ఎప్పటి నుంచి ఉంది?
జవాబు. C) పూర్వ యుగం
v) ప్రశ్న భారతదేశ రాజకీయ సాంఘిక , సాంస్కృతిక చరిత్రలో తెలుగు వారిది
ఎలాంటి పాత్ర?
జవాబు. A) ప్రధాన పాత్ర
(OR)
1 0f 23
Page 4
రెండవ గద్యాంశము జవాబులు
i) ప్రశ్న: మనుమ సిద్ధి, తమ్మసిద్ధి ఎవరి కుమారులు?
జవాబు. D) ఎర్ర మనుమసిద్ధి
ii ప్రశ్న: గణపతి దేవుడు దక్షిణ దేశంపై ఎన్ని సార్లు దండయాత్ర చేశాడు?
జవాబు. A) రెండు సార్లు
iii ప్రశ్న: చోళరాజు కులోత్తుంగుడు ఎవరికి రాజ్యాన్ని అప్పగించాడు?
జవాబు.B) నల్ల సిద్ధికి
iv ప్రశ్న : రెండో రాజాధిరాజు ఏ కాలం వాడు?
జవాబు. C) 1173
v ప్రశ్న: తెలుగు చోళుల నెల్లూరి రాజ్యం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు. A) పన్నెండవ శతాబ్దం.
పరిచిత పద్యము
2. a) క్రింది పద్యమును చదివి, దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు.
మొత్తం అయిదు ప్రశ్నలు ఒక్క మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు. ఉంటాయి 5X1=5
పరిచిత పద్యం ప్రశ్నలు - జవాబులు
i) ప్రశ్న: ఈ కవితను రాసింది ఎవరు?
జవాబు.B) కనుపర్తి రామచంద్రాచార్యులు
ii) ప్రశ్న: మౌన వ్రతం ఎన్నాళ్ళు సాగింది?
జవాబు. A) ఏడాది
iii) ప్రశ్న: దేవుడి వాహనం ఏది?
2 0f 23
Page 5
జవాబు. A) నెమలి
iv) ప్రశ్న: ఎవరి బతుకు సమాజంలో ఇంతే అని కవి వాపోతాడు?
జవాబు. C) నల్లవాళ్ళు
v) ప్రశ్న: ఉద్యాపన అంటే ఏమిటి?
జవాబు. D) ఉద్వాసన
b) గద్యమును చదివి సరియైన సమాధానములను రాయాలి.
ఒక్కొక్క ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు. 5 X1=5
పరిచిత గద్యం ప్రశ్నలు - జవాబులు
i) ప్రశ్న: మందారవతి అన్నది ఏమిటి?
జవాబు. C) వనము పేరు
ii) ప్రశ్న: సఖ్యముగా ఉన్నవి ఏవి?
జవాబు. A) జింక, కాకి
iii) ప్రశ్న: నక్క పేరేమిటి?
జవాబు. B) సుబుద్ధి
iv) ప్రశ్న : సజ్జన దర్శనము సమస్త ----------------- పోగొట్టు ను.
జవాబు. D) దోషములు
v) ప్రశ్న : `సావాసము ' అంటే ఏమిటి?
జవాబు. C) స్నేహము.
PART-B
విభాగం - `బి'
(వ్యాకరణ విభాగం)
3. a)అలంకారాలు: ఇందులో ఇవ్వబడిన అలంకార సంబంధిత మైన మొత్తం ఏడు ప్రశ్నలు ఉంటాయి. అయిదు
ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు.
3 0f 23
Page 6
5X1=5
అలంకారం జవాబులు
i) ప్రశ్న: ` సీతా దేవి భూదేవిలా గొప్ప సహనమూర్తి. ఇందులో ఉపమావాచకాన్నిగుర్తించండి.
జవాబు. C) లా
ii) ప్రశ్న: ఆ గ్రామమున చెట్లు ఆకాశమును అంటుతున్నవి –
ఇందులోని అలంకారం ఏది ?
జవాబు.D) అతిశయోక్తి
iii) ప్రశ్న: రామలక్ష్మణులు రావణ ఇంద్రజిత్తు లను సంహరించారు.
జవాబు. B) క్రమాలంకారము
iv) ప్రశ్న: గాంధీ స్వరాజ్యమును సాధించెను. మహాత్ములకు సాధ్యము కానిదేది?
జవాబు. A) అర్ధాంతర న్యాసాలంకారము
v) ప్రశ్న : `కింది వాటిలో శ్లేషాలంకార లక్షణం ఏది?
జవాబు. C)రెండు అర్ధా లు కల్పించడం.
vi) ప్రశ్న: దేన్ని వర్ణిస్తా మో అది __________________ ?
జవాబు. A) ఉపమేయం
vii) ప్రశ్న: నేను నీకుమారుడనే కదా! - ఇందులోని అలంకారము ఏది?
జవాబు. C) శ్లేషాలంకారము
b) ఛందస్సు
ఇందులో ఇవ్వబడిన ఛందస్సు సంబంధిత మైన మొత్తం ఏడు ప్రశ్నలు ఉంటాయి. అయిదు ప్రశ్నలకు జవాబులు
రాయాలి.
ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు. 5X1=5
ఛందస్సు జవాబులు
అని యిట్లయ్య జు డానతిచ్చి మఱి దానంతర్హితుండైన నె
4 0f 23
Page 7
i) ప్రశ్న: పై పద్యపాదం ఏ ఛందస్సు కి చెందింది?
జవాబు. B) మత్తేభము
ii) ప్రశ్న: పైపద్య పాదంలో యతి స్థా నంగా గల అక్షరము ?
జవాబు. C) న
iii) ప్రశ్న: మ స జ స త త గ - అనే గణాలు ఏ పద్యంలో ఉంటాయి?
జవాబు. A) శార్దూలము
iv) ప్రశ్న: శార్దూలము నకు యతి స్థా నం ఎన్నవ అక్షరము?
జవాబు. D) 13 వ అక్షరము
v) ప్రశ్న: ఉపజాతికి చెందిన పద్యం ఏది?
జవాబు. D) తేటగీతి
Vi) ప్రశ్న: ఆటవెలదిలో మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి?
జవాబు. A) 10
Vii) ప్రశ్న: ఇంద్ర గణాలు 6, సూర్య గణాలు 2 ఉండడం ఏ పద్యలక్షణము?
జవాబు C) సీసము
PART - C
విభాగం - సి
4. (A) Poetry: పద్య భాగం
a) ఇందులో రెండు పద్యాలు ఇచ్చిన పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్ధం రాయండి.
1x6=6
ప్రతిపదార్థంలో కవి పేరు, గ్రహించబడిన గ్రంధము మరియు పాఠం యొక్క పేర్లు రాస్తే - 1 మా
* ప్రతి పదార్థం అన్వయపూర్వకంగా రాస్తే - 5మా
జవాబు:
5 0f 23
Page 8
కవి పేరు : తిక్కనసొమయాజి
గ్రహింపబడిన గ్రంధం: మహాభారతంలోని ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం
పాఠం పేరు: శ్రీకృష్ణరాయబారం
అన్వయ క్రమంలో ప్రతి పదార్ధము
వీరును = ఈ కౌరవులునూ
వారున్ = ఆ పాండవులునూ
పండితులు = విద్యా పండితులు
విక్రమవంతులు = పరాక్రమంగలవారు
బాహుగర్వ = భుజ బల గర్వంవల్ల
దుర్వారులు = వారించటానికి వీలుకానివారు.
పూని = పూనుకొని (వారిద్దరూ పూనుకొని)
రిత్త బవరంబునన్ = వ్యర్థమైన, యుద్ధములో
ఆఱడిన్ + చావన్ +పోవన్ = నిష్ప్రయోజనంగా చావటానికి సిద్ధంకాగా
ఎట్లు = ఎలాగున,
ఊరకయుండవచ్చున్
(ఊరక + ఉండన్ + వచ్చున్) = ఊరుకోవచ్చు ?
కడునొప్పెడు
(కడున్ + ఒప్పెడు) = మిక్కిలి చక్కనైన
మేనులు = వారి శరీరాలు: (వారి శరీరాల్లో)
వాడి కైదువుల్ = పదునయిన, ఆయుధాలు
కూరగనాటినన్ = కూరుకు పోయేటట్లు , దిగబడగా
పుడమిన్ +కూలుటకున్ = భూమి మీదకూలిపోవడానికి
6 0f 23
Page 9
అక్కట = అయ్యో !
ఓర్వ వచ్చునే? = సహింపవచ్చునా?
(లేదా)
జవాబు:
కవి పేరు : తిక్కనసొమయాజి
గ్రహింపబడిన గ్రంధం:మహాభారతంలోని ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం
పాఠం పేరు: శ్రీకృష్ణరాయబారం
అన్వయ క్రమంలో ప్రతి పదార్ధము
వారలు = ఆ పాండవులు
శాంతశూరులు = శాంతమూ, శౌర్యమూ, కలవారు
భవచ్చరణంబులు
(భరత్ + చరణంబులు) = నీ పాదాలను:
కొల్వఁబూని (కొల్వఁ + పూని) = సేవించటానికి సిద్ధమై
ఉన్నారు = ఉన్నారు
అటుగాక (అటు + కాక) = అలాకాక
మీకది (మీకున్ + అది) = మీకు వారి వినయము, శాంతి
మనంబునకున్ = మీ మనస్సులకు
అప్రియమేని (అప్రియము + ఏని) = ఇష్టము కాకపోతే;
భూవర = ఓ రాజా!
ఇ౦తకున్ = ఈ పాటికి
పోరికిన్ = యుద్ధా నికి
వచ్చుచుండుదురు = వస్తూ ఉంటారు.
7 0f 23
Page 10
రెండు తెఱంగులందున్ = పై రెండు విధాలలో (పక్షాలలో)
అరయన్ = పరిశీలింపగా
నీకు, పథ్యము = నీకు, మేలయినది
ఏది యగున్ (ఏది + అగున్) = ఏమి అవుతుందో
అవ్విధము (ఆ + విధము) = ఆ రీతిని
ఏర్పడన్ = స్పష్టంగా
నిశ్చయింపుమా = నిర్ణయించు
b) రెండు ప్రశ్నలలో ఒకదానికి వంద పదాలలో సరియైన జవాబు రాయాలి.
• పాఠం పేరు, రచయిత / రచయిత్రి పేరు - 1 మా
విష యమునకు - 3 మా
శైలి కి 1మా
బి ) కింద ఇచ్చిన ప్ర శ్నలలో ఒకదానికి వంద పదాలలో సమాధానాలు రాయండి
1x5=5
1) గంగా ప్రవాహాన్ని కవి ఎలా వర్ణించాడో వివరించండి?
జవాబు ) గంగా ప్రవాహాన్ని కవి ఇలా వర్ణించాడు
బ్రహ్మభగీరథుకునకు ఇచ్చిన వరప్రభావంతో శివుడు గంగను తన శిరస్సుపై ధరిస్తా నని భగీరథునకు మాట
ఇవ్వటంతో గంగ ఆగ్రహంతో మేఘ గర్జన ధ్వనిని మించిన ధ్వనితో లోకాలకు భయాన్ని కలిగిస్తూ భయంకరంగా
హిమాచలము వంటి శివుని శిరస్సుపై అద్భుతంగా పడింది. ఈ విధంగా గంగ అడ్డు పెట్టా రని వేగంతో ఈశ్వరుని
శిరస్సుపై పడినా అక్కడ నుండి వెళ్ళలేక శివుని మాయచే అడ్డగింపబడి, శివుని జటాజూటమున తిరుగసాగింది.
అప్పుడు బ్రహ్మ ను ముందు పెట్టు కొని దేవతలు ఈశ్వరుని వద్దకు వచ్చి శివుని స్తు తించి శివుని మ్రొక్కి గంగానది
గర్వము నీ మాయచే దూరం అయ్యింది. భక్తు డైన భగీరధునిపై నీవు దయచూపి గంగానదిని విడిచిపెట్టడం మంచిది
అందువల్ల సగర పుత్రు లవిముక్తి మనుష్య పాతా ళ లోకంలో పవిత్ర భావాలు ఉదయి స్తా యి అని శివుని వారు
ప్రార్థించారు. అప్పుడు శివుడు ప్రసన్నుడై గంగను బిందు సరోవరంలో విడిచి పెట్టా డు. తరువాత గంగ ఏడు
పాయలుగా విడిపోయింది .అందులో మూడు మహానదులు హ్లా దిని , పావని, నందిని, అనే పేర్లతో తూర్పుదిక్కు
ప్రవహించాయి. మరో మూడు శాఖలు సీత, సుచక్షువు ,సింధు అనే పేర్లతో పడమటి దిశకు ప్రవహించాయి. ఏడవ
8 0f 23
Page 11
శాఖ ఆశ్చర్యంగా భగీరధుని సమీపానికి ప్రవహించింది. అప్పుడు భగీరథుడు తన రథానికి తన వద్దకు వచ్చిన
గంగానది శాఖ వెంట బయల్దేరాడు .అన్ని దేశాల ప్రజలు సంతోషంతో గంగా జలాల్లో స్నానం చేశారు.
ఈశ్వరుని శరీరాన్ని గంగ తాకినందున గంగా జలం పవిత్రమైందని ఇంద్రాది దేవతలు యక్ష గంధర్వులు గంగలో
మునిగారు. తరువాత జహ్నుడనే రాజుయొక్క యాగశాలను గంగాదేవి తన నీటితో ముంచింది . కోపంతో
జహ్నుడు గంగను మింగాడు దేవతలు అతని వద్దకు వెళ్లి గంగను విడువమని చెప్పారు .అప్పుడు జహ్నుడు గంగను
తన చెవుల నుండి విడిచిపెట్టా డు.l అప్పటి నుండి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది .తర్వాత గంగ భగీరధుని
రథాన్ని అనుసరించి సముద్రానికి వెళ్లింది. భగీరథుడు గంగను వెంట పెట్టు కుని పాతాళానికి వెళ్లా డు. భగీరధుని
వెంట వచ్చిన గంగ సగరపుత్రు ల భస్మరాశులను తన జలంతో తడిపింది. వెంటనే సాగరపుత్రు లు పాప విముక్తి
పొందారు. వారు దివ్యరూపాలు ధరించి పుష్పక విమానాల్లో భగీరథుడు చూస్తుండగా స్వర్గానికి దేవతల వెంట
వెళ్లా రు. భూలోకంలో గంగ జహ్నుని కుమార్తె కావున జాహ్నని అనే పేరుతో భగీరధుని పుత్రిక కావున భాగీరథి అనే
పేరుతో ప్రవహిస్తుందని దేవతలు భగీరథునికి చెప్పారు ఈ విధంగా గంగా ప్రవాహం సాగింది
2) భగీరథుని పట్టు దలను గురించి రాయండి.
జవాబు: భగీరథుడు కోసలదేశపు రాజు తన పూర్వీకులైన సగరపుత్రు లు కపిల మహర్షి కోపాగ్నికి బలయ్యారని
విని వారికి మోక్షప్రాప్తి కల్పించే విషయం గురించి ఆలోచించాడు. అందుకోసం గోకర్ణంలో గొప్ప తపస్సు చేశాడు.
బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా భగీరథుడు సగరపుత్రు ల భస్మము గంగా నదీ జలంతో
తడిసేటట్లు గా మొదట వరాన్ని కోరాడు. రెండవ వరంగా తనకు పుత్రు డు కావాలని కోరాడు.బ్రహ్మ భగీరథునికి పుత్ర
జననం కలుగుతుంది అని చెప్పి గంగ నేలపై పడితే శివుడు తప్ప భూమి భరించలేదని చెప్పాడు అందువల్ల శివుని
గురించి తపస్సు చేయమని చెప్పాడు.
భగీరథుడు బొటనవ్రేలుపై నిలిచి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన తలపై ధరిస్తా నని
చెప్పాడు .అప్పుడు గంగా ప్రవాహ వేగంతో శివుని శిరస్సుపై పడింది .శివుని మాయచే బయటకు రాలేక శివుని
జటాజూట మందే తిరుగసాగింది. శివుడ్ని దేవతలు ప్రార్థించగా శివుడు గంగను విడిచిపెట్టా డు .అలా విడిచిపెట్టబడిన
గంగా ఏడు శాఖలయింది.
హ్లా దిని , పావని, నందిని, అనే గంగా ప్రవాహాలు తూర్పు దిశగా సీత సీత, సుచక్షువు ,సింధు వు అనే ప్రవాహాలు
పడమటి దిశకు ప్రవహించగా ఒక పాయ భగీరధుని వద్దకు వెళ్లింది
అన్ని దేశాల ప్రజలు సంతోషంతో గంగా జలాల్లో స్నానాలు చేశారు. వారి పితృదేవతలు స్వర్గానికి వెళ్లా రు. గంగ
ఈశ్వరుని దేహాన్ని తాకినందున పవిత్రమైందని దేవతలందరూ గంగా జలంలో మునిగారు.
జహ్నుడనే ముని యాగం చేస్తుండగా గంగా అతని యజ్ఞశాలను ముంచింది. కోపంతో ఆ రాజు గంగను మింగాడు.
9 0f 23
Page 12
దేవతలు గంగను విడువమని కోరారు. జహ్నుడు తన చెవుల నుంచి గంగను వదిలాడు. జహ్నుని కుమార్తె కావున
జాహ్నని అని పేరు వచ్చింది. తర్వాత ఆ గంగా ప్రవాహం భగీరధుని రథం వెంట ప్రవహించి సముద్రానికి వెళ్లింది.
ఎండిన సముద్రంలో సగరపుత్రు లు తవ్విన రంధ్రం నుంచి ప్రవేశించి భగీరథుడు గంగ వెంట పాతాళానికి వెళ్లి
సగరపుత్రు ల భస్మరాసుల్ని చూశాడు. రాసులన్నీ తడిసేలా గంగ ప్రవహించింది .వెంటనే సగరపుత్రు లు దివ్య
రూపాలను పొంది స్వర్గానికి వెళ్లా రు. సముద్రు డు ఎంత వరకు భూమిలోకి ప్రవేశిస్తుందో అంత వరకు సగరపుత్రు లు
స్వర్గం లో ఉంటారు. జాహ్నవి అని భగీరధుని కుమార్తె కనుక భాగీరథి అని పేరు పొందింది
c) క్రింది ప్రశ్నలలో మూడింటికి ఏకవాక్య సమాధానం రాయండి. 3x1= 3
i) కోకిలను ఎవరు తరిమి కొట్టా రు?
జవాబు: కోకిలను కాకులు తరిమికొట్టా యి
ii)ధవళ పారావతం అంటే ఏమిటి?
జవాబు: ధవళపారావతం అంటే తెల్లని పావురం
iii)కనపర్తి కి ఉన్న బిరుదు ఏది?
జవాబు: కనపర్తి కి వచన కవితా ప్రవీణ అనే బిరుదు కలదు
iv) కోకిల పాటకు లభించిన స్పందన ఎలా ఉంది?
జవాబు: కోకిల పాట భగవద్గీతలా ఉల్లా సాన్ని, జాతీయ గీతంలా ఉత్తేజాన్ని కలిగించింది.
v) కోకిల పాఠం రాసిన కవిది ఏ ఊరు ?
జవాబు: కోకిల పాఠం రాసిన కవి ఊరు భద్రాచలం
B గద్యభాగం(PROSE)
a) క్రింది ప్రశ్నలలో 2 ప్రశ్నలకు వంద పదాలలో సమాధానాలు రాయండి
2 x 5 = 10
i) ప్రశ్న : ముసలి గద్ద కథను రాయండి
గంగానదీ తీరంలో జువ్వి చెట్టు తొర్రలో (జరద్గవము) ముసలి గద్ద ఉండేది. ఆ చెట్టు పైనే పక్షులు తమ ఆహారంలో
కొంత భాగం గద్దకు ఇచ్చేవి, ఆ ఆహారముతో అది జీవించేది. ఒకరోజు దీర్ఘకర్ణమనే పిల్లి ఆ చెట్టు పై ఉన్న పక్షి పిల్లల్ని
తినాలని అక్కడకు రాగా పక్షి పిల్లలు భయపడి కూయడం ప్రారంభించాయి, గద్ద విని ఎవరక్కడని హెచ్చరించింది
10 0f 23
Page 13
పిల్లి తెలివిగా గద్దకు నమస్కారం చెప్పింది .తన పేరు అడుగగా దీర్ఘ కర్ణము అని చెప్పింది. వెంటనే గద్ద పిల్లిని
దూరంగా వెళ్లిపొమ్మని చెప్పింది లేకుంటే చంపుతానని చెప్పింది. అందుకు నేను రోజు గంగా స్నానం చేస్తూ మాంసం
తినటం మానేశానని గద్దను ధర్మాత్ముడిగా భావించి చూడాలని వచ్చినట్లు చెప్పింది. ఆ విధంగా పిల్లి గద్దను బాగా
నమ్మించింది, పిల్లి మాటల్ని నమ్మిన గద్ద పిల్లితో స్నేహం చేసి చెట్టు తొర్రలో ఉండ సాగింది .కొన్నాళ్ల తర్వాతపిల్లి ప్రతి
రోజుచెట్టు పైకి పక్షి పిల్లల గొంతులు కొరికి తెచ్చి తొర్రలో తినసాగింది పిల్లలు కనపడక పక్షులు ఏడవసాగాయి .
పిల్లిఅది తెలుసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయింది పక్షులకు తమ పిల్లల ఎముకలు ఆ చెట్టు తొర్రలో కనిపించడం
చూసి తమపిల్లలను ఆ గద్ద తిన్నద ని ఊహించి తమ గోళ్లతో గద్దను చంపాయి.
నీతి కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు
ii) మృగకాకముల స్నేహాన్ని వివరించండి ?
మగధదేశంలో ఒక అడవిలో చాలా రోజులుగా జింకా కాకి స్నేహంగా ఉండేవి. జింక బాగా బలిసి అడవిలో తిరిగేది.
నక్క ఆ జింక మాంసాన్ని ఎలాగైనా తినాలని జింకకు మాయమాటలు చెప్పి నమ్మించింది. నక్క మాటలు నమ్మిన
జిక తన వెంటపెట్టు కుని వెళ్లింది. కాకి నక్కని చూసి ఎవ ర ని జింకను అడుగగా జింక,తామిద్దరి స్నేహం గురించి
చెప్పింది. కొత్తగా వచ్చిన వారిని నమ్మవద్దని జింకను కాకి హెచ్చరించింది. నక్కఏవో నీతులు చెప్పికాకి ని జింక ని
నమ్మించింది. నక్క మాయమాటలు విని కాకి సరే అంది. ముగ్గురు స్నేహంగా ఉండ సాగే వారు. కొన్నాళ్ల తర్వాత
ఒకరోజు నక్క జింక తో ఒకమంచి పైరు గల పొలాన్ని చూశానని తనతో జింకను తీసుకువెళ్లి చూపించింది. జింక ఆ
పైరును తినడం ప్రారంభించింది ఇది గమనించిన పొలం యజమాని రహస్యంగా పొలంలో వలను ఏర్పాటు చేశాడు.
మరునాడు జింక వచ్చి పొలంలో దిగి వలలోచిక్కబడింది. జింక తాను వలలో చిక్కుకున్నట్లు గ్రహించి తన మిత్రు డు
నక్క వస్తే తా ళ్ళను కొరికి తనను రక్షిస్తా డని భావించింది. నక్క అక్కడ కొచ్చి ఇంకా వలలో పడినందుకు
సంతోషించి, దాని మాంసాన్ని తినవచ్చునని భావించింది. నక్క వాళ్ళ దగ్గరగా వెళ్లి ఆ వల ను లి నరాలతో
చేయబడినదని చెప్పి తప్పించుకున్నది. కాకి ఉపాయం ప్రకారం ఊపిరి బిగబట్టి జింకను పడుకోమని చెప్పింది. పొలం
యజమాని వచ్చి జింక సంహరింపబడిందని భావించి వలను ఊడదీశాడు. జింక పారిపోయింది. జింక తనను
మోసం చేసిందని భావించి చేతిలోని కర్రను విసిరాడు. ఆ కర్ర ప్రక్కనే ఉన్న నక్కకు తగిలి నక్క చనిపోయింది
నీతి పరులకు హాని చేయగోరువారు తామే చెడిపోదురు.
iii)కొమర్రాజు సాహిత్య సేవను తెలపండి
కొమర్రాజు లక్ష్మణ రావు గొప్ప మేధావి, దేశభక్తు డు. ఆ రోజుల్లో చాలా మంది ఆంధ్ర ప్రాంతం వారికి
తెలంగాణ పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. వీరూ మునగాల సంస్థా నానికి చెందిన వారు కావడం వల్ల
హై దరాబాద్‌కు ఎక్కువగా రాకపోకలు చేసేవారు. ఇందులో భాగంగానే 1900 సంవత్సరంలో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర
11 0f 23
Page 14
భాషా నిలయం స్థా పించబడింది. లక్ష్మణ రావు గారు రావిచెట్టు రంగారావు మునగాల రాజారావు గారి తోడ్పాటుతో
తెలంగాణ ప్రాంతంలో సాహిత్య వికాసానికి సాంస్కృతిక చైతన్యానికి మంచి పునాదులు ఏర్పడ్డా యి. తర్వాతి కాలంలో
అనేక గ్రంథాలయాలు స్థా పించి సాహిత్య సభలు జరిపి తెలుగుభాష ఉద్యమానికి మంచి కృషి చేశారు.
లక్ష్మణ రావు గారికి చరిత్ర పరిశోధన భాషా పరిశోధన విజ్ఞాన వాఙ్మయ అభివృద్ధి వీరి ఆశయాలు. తమ
ఆశయాలకనుగుణంగా అనుయాయులను మలుచుకున్నారు. మాడపాటి హనుమంతరావుగారి పైన లక్ష్మణరావు
గారి ప్రభావం కనిపిస్తోంది. ఆదిరాజు వీరభద్రరావు వీరి శిక్షణలో పెరిగారు సురవరం వారికి వీరూ మార్గదర్శకులు.
iv) ప్రశ్న తెలుగు భాషను సంస్థా నాలు ఎలా ఆదరించాయి?
తెలుగు భాషను ఆదరించి ప్రోత్సహించిన సంస్థా నాల కృషి మనం మరువరాదు. గద్వాల వనపర్తి ఆత్మకూరు
సంస్థా నాలను ఈ సందర్భంగా ప్రశంసించాలి. ఈ సంస్థా నాల ఆదరణ వల్ల ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య
సాంస్కృతిక సంబంధాలు పెంపొందాయి. ప్రతి సంవత్సరం ఆంధ్ర ప్రాంతంనుండి కవులు పండితులు వచ్చి ఈ
సంస్థా నాలలో సన్మానాలు పొందే వారూ. ఇటువంటి వారిలో తిరుపతి వెంకట కవులు ముఖ్యులు. ఆ కవుల
అవధానాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య భాషాపరమైన వంతెనలుగా నిలిచాయి. కొమర్రాజు లక్ష్మణరావుగారు
మునగాల సంస్థా నానికి దివాన్.వీరూతెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేశారు.
లక్ష్మణ్ రావు గారి కృషికి మునగాల వారి సాయంలభించింది. ఈ విధంగా శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
స్థా పించబడినది హన్మకొండలో రాజరాజనరేంద్ర భాషా నిలయం స్థా పితమైంది.
v) ప్రశ్న దేవులపల్లి రామానుజరావు గురించి రాయండి
తెలుగు సారస్వత వికాసం కోసం జీవితాన్ని ధారపోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి దేవులపల్లి రామానుజరావు.
వరంగల్ లోని దేశాయిపేటలో 1917 ఆగస్ట్ 25 న ఆండాలమ్మ చలపతిరావు లకు జన్మించారు. ప్రాథమిక విద్యను
ఇంటి వద్దనే చదువుకొని హై స్కూల్ విద్యను హన్మకొండలో పూర్తి చేశారు. హై దరాబాద్ నిజాం కళాశాలలో బి ఏ
నాగపూర్‌లో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. ఈ విద్యాభ్యాస కాలంలో కాళోజీ పీవీ నరసింహారావు ఆయన
సహోద్యోగులుగా పనిచేశారు విద్యార్థి దశ నుండే భాషా సాహిత్య రచన వ్యాసంగాల పట్ల ఆసక్తి పెరిగింది. గోల్కొండ
పత్రికలో వ్యాసాలు కూడా రాశారు. న్యాయశాస్త్ర విద్యార్థి దశలోనే 1953 పచ్చతోరణం అన్ని ఖండకావ్య సంపుటిని
వెలువరించి కవిగా ప్రశంసలను పొందారు. నా రేడియో ప్రసంగాలు, ఉపన్యాస తోరణము, వేగుచుక్కలు,
50సంవత్సరాల జ్ఞాపకాలు మొదలగు రచనలు చేశారు. 1946 లో శోభ అనే సాహిత్య పత్రికను వరంగల్ నుంచి
తీసుకొచ్చాడు. 15 సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసి సమాజంలో సామాజిక సాహిత్య చైతన్యానికి
తోడ్పడ్డా డు. తెలుగుభాష సాహిత్య వికాసానికి అంకితమై, ఆంధ్ర సారస్వత పరిషత్‌కు ఘనకీర్తిని సంపాదించి పెట్టా రు.
1960 -62 మధ్యకాలంలో సాహిత్యరంగం నుంచి రాజ్యసభ సభ్యులుగా పని చేసి వారి యొక్క అమూల్యమైన
12 0f 23
Page 15
సేవలను అందించారు. దేవులపల్లి 8 జూన్ 1993 తుదిశ్వాస విడిచారు.
b) కింద ఇఛ్చిన ప్రశ్నలలో మూడింటికి ఒకవాక్యంలో సమాధానాలు రాయండి 3x1=3
i) : సృజనశీలతపాఠ్యభాగ రచయితగురించి రాయండి.
జవాబు :
సృజనశీలతపాఠ్యభాగ రచయిత డాక్టర్ ఏపీజే అబ్దు ల్ కలాం గారు వీరి రచనలు ఏ విజన్ ఫర్ న్యూ మిలీనియం
వింగ్స్ అఫ్ ఫైర్ ఇజ్ఞిటెడ్ మైండ్స్ ఎన్విజనింగ్యాన్ ఎంపవర్డ్ నేషన్
ii ): సృజనాత్మకత జీవన సరళిని ఎలా మారుస్తుంది?
జవాబు:
సృజనాత్మకత అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది నూతన ఆవిష్కరణలకు సరికొత్త సంపాదకు దారితీస్తుంది సాంకేతిక
పరిజ్ఞానం సహాయంతో ఈ ప్రపంచాన్ని మరింత వాసయోగ్యం చేసే దిశగా తన ప్రణాళికలను అమలుచేస్తూనే
ఉంటుంది
iii)రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయని కలాం చెప్పారు?
జవాబు:
భవిష్యత్తు లో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్ లతో నడిచే రోబోట్స్ కి అప్పజెప్పే
అవకాశం ఉంటుంది అప్పుడువాళ్ళు తమ భావన సామర్థ్యంతో ప్రయోగశీల వివే తిరిగి మల్ల కంప్యూటర్ లను
ఓడించగలిగే స్థా యికి చేరుకుంటారు
iv) రైట్ సోదరులు సాధించిన విజయము ఏమిటి?
జవాబు: రైట్ సోదరులు వారి సంకల్పబలం వల్ల కృషి వల్ల మనిషి ఆకాశంలో ఆకాశంలో ఎగరగలడని నిరూపించారు.
పట్టినపట్టు విడువకుండాసృజనాత్మకంగా ఆలోచించగలిగితే ఆలోచించగలిగితే మనిషివిజయం సాధించగలడని రైట్
సోదరులు విమానాన్ని కనుక్కోవడం ద్వారా నిరూపించారు
c). ఉపవాచకం -యాత్రా రచన:
ఇవ్వబడిన రెండు ప్రశ్నలనుండి ఒక దానికి నూట ఇరవై పదాలలో సమాధానమును రాయాలి.
1x6= 6
• రచయిత పేరు -వివరాలు, యాత్రా రచన పేరు 2 మా
* విషయ వివరణకు 4మా
13 0f 23
Page 16
* భాషా వ్యాకరణ దోషాలు ఎన్ని ఉన్నా అరమార్కు కన్నా ఎక్కువ తీయరాదు.
i) ముద్దు రామకృష్ణయ్య కు విదేశీయాత్రకు పాస్ పోర్ట్ ఎలా లభించింది?
జవాబు:
రామకృష్ణయ్య గారు తన చిన్న ఫోటోలు పది రూపాయలు ఫీజు తో హుస్నాబాద్ కు ఒక దరఖాస్తు వ్రాసి వాటిని
లాతూర్ కలెక్టర్ అబ్దు ల్ హమీద్ గారు తన సిఫారసు తో ఉస్మానా బాద్ కలెక్టర్ కు దాన్ని పంపారు.
తన దరఖాస్తు హోం శాఖకు త్వరగా పంపమని రామకృష్ణయ్య ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక లేఖ రాసి దాన్ని ఒక
పిల్లవాడికి ఇచ్చి కవర్లో పెట్టి పంపారు.
రామకృష్ణయ్య హై దరాబాద్ వెళ్లి తన పాస్ పోర్ట్ దరఖాస్తు గురించి తెలుసుకుందామని ఆఫీస్ కి వెళ్లా రు. ఇక్కడ
వారు రామకృష్ణ పాస్ పోర్ట్ దరఖాస్తు తమకు రాలేదన్నారు. డిపార్ట్మెంట్ వారు కూడా అలాగే చెప్పారు. తరువాత
ఉమ్మూరి అమ్మ గారి ఆఫీస్ లోను కారవై రాలేదన్నారు. అక్కడ వెతికిస్తే రామకృష్ణయ్య గారి దరఖాస్తు ఉంది. వారి
పాస్పోర్ట్ రావడానికి ఒక సంవత్సరం పడుతుంది అన్నారు, రామకృష్ణయ్య తన పరిస్థితిని అక్కడ చీఫ్
సూపరిండెంట్ గారికి చెప్పి త్వరగా పాస్పోర్ట్ ఇప్పించమని బ్రతిమిలాడాడు. ఆయన రామకృష్ణకు గుల్బర్గా పోలీస్
అసిస్టెంట్ కమిషనర్ శివలాల్ గారిని కలిసి చెప్తే పని అవుతుందని సలహా ఇచ్చాడు. రామకృష్ణ వెళ్లి శివలాల్ గారిని
కలిసి ఇంగ్లాండ్ తాను అప్పుడు వెళ్లకపోతే ఇంక తన జన్మలో వెళ్లలేనని బతిమిలాడాడు. కనుక తన దరఖాస్తు
తొందరగా హోం డిపార్ట్మెంట్ పంపమని బతిమిలాడాడు.
నవాబ్జంగు గారు రామకృష్ణయ్య కాగితాలపై సంతకం చేసి ఒక గుమాస్తా ను తోడిచ్చి వెంటనే పాస్పోర్ట్ ఇమ్మని
నిజాం ప్రభుత్వ సిఫారసు లేఖ పంపారు.
రామకృష్ణయ్య రెసిడెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీ కలిశాడు. ఆయన రామకృష్ణ నీకు యూనివర్సిటీ అడ్మిషన్
దొరికినట్లు కాగితం చూపిస్తేనే కానీ పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పాడు. రామకృష్ణయ్య మీర్జా అలీ గారి సలహా పై ఎడిమ్బరో
విశ్వవిద్యాలయానికి పీహెచ్డీ అడ్మిషన్ కోసం రిప్లై పెయిడ్ టెలిగ్రామ్ ఇచ్చాడు.
రామకృష్ణయ్య ఆ జవాబు కోసం రెండు రోజులు ఎదురు చూసి తన పని ఒక మిత్రు నికి అప్పగించాడు.
బ్రిటన్ నుండి వచ్చిన జవాబులు రెసిడెంట్ లో చూపించానని పాస్పోర్ట్ ఇవ్వనన్నారని వ్రాశాడు. తిరిగి హై దరాబాద్ వెళ్లి
తనకు పాస్పోర్ట్ ఇవ్వమని బతిమిలాడాడు, దానికి 10000 రూపాయలు రామకృష్ణ వద్ద ఖర్చులకు ఉన్నట్టు
చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తా నన్నాడు.
దానిపై రామకృష్ణయ్య మీర్జా అలీ గారి సాయంతో కోర్ట్ సర్టిఫికెట్ సంపాదించి పాస్పోర్ట్ సాధించాడు.
14 0f 23
Page 17
ii) ముద్దు రామకృష్ణయ్య అనుభవాల్లో మీకు నచ్చినవి రాయండి?
జవాబు:
రామకృష్ణయ్య ముంబై ముంబైలో పడవ ఎక్కిన తర్వాత కొన్ని రోజులు ఆ పడవ అక్కడే ఉంది. ఎక్కిన
వారినిదిగనివ్వలేదు. రామకృష్ణయ్య కేబిన్‌లో మరో ముగ్గురు ఉన్నారు. ఎక్కిన పడవ చిన్నది కాదు పెద్దది కాదు
బయటనుండి గాలి వచ్చే ఏర్పాట్లు ఫ్యాన్లు ఉన్నాయి. రామకృష్ణయ్యగారి ప్రయాణ అనుభవాలలో నాకు నచ్చినవి
పడవలో హాస్పిటల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉంది. ప్రయాణికులకు టెలిగ్రామ్ వస్తే ఇస్తా రు. పడవలో దుకాణం ఉంది. అక్కడ
అన్ని వస్తు వులు దొరుకుతాయి. చిన్న పిల్లలకు నర్సరీ కిండర్ గార్డన్ సెక్షన్లు ఉంటాయి. అక్కడ శిక్షణ పొందిన
ఆడవారు ఉంటారు. ప్రయాణీకులు తమ పిల్లల్ని అక్కడ విడిచిపెడతారు. పుస్తకాలు చదువుకోవడానికి ఇస్తా రు.
ఔట్డోర్ గేమ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా పడవలో ఆడే డిక్ ఆటలు వినోదం కోసం సంగీతం పాటలు ఏర్పాటు ఉంటుంది
.పడవలో చాలా వారాలు ప్రయాణం వల్ల రామకృష్ణయ్యకు పాశ్చాత్య శాకాహార భోజనం అలవాటైంది. ఈ అంశం
నాకు చాలా నచ్చింది. పడవలో పాశ్చాత్యులు ఎక్కువ భారతీయులు తక్కువ ఉన్నారు పడవ ఇంగ్లాండ్‌కు వెళ్లా క
డబ్బులు లేని వారిని ఈ వెనుకకు పంపుతారని తెలిసి రామకృష్ణయ్య భయ పడ్డా రు,ఎలాగైనాఇంగ్లాండ్‌లో తనను
దింపు మని దేవునికినమస్కరించాడు, ఆ పడవలోని ఉన్న సురేష్ చందర్ ఆసానా అనే మరో హై దరాబాద్ విద్యార్థితో
రామకృష్ణయ్యకు స్నేహమయింది.పడవ ఈడెన్ లో ఆగింది. ఆ పడవలోని గుజరాతి పిల్లల బంధువులు ఈడెన్ లో
ఉన్నారు. వారు తమ బంధువులతో పాటు రామకృష్ణయ్యకు ఆ నగరంలో ని చారిత్రక ప్రదేశాల్ని చూపించారు. పడవ
సూయజ్ చేరగానే బొగ్గు ఆయిల్ నీళ్ళు నింపారు.సయ్యిద్ రేవులో ఈజిప్ట్ వ్యాపారస్థు లు పడవలలో వస్తు వులు తెచ్చి
అమ్మారు . అక్కడ నుండి వారు మ్యూజియంకు
చేరారు .పడవ జిబ్రాల్టర్కు చేరింది. రామకృష్ణయ్య పాస్పోర్ట్ చూసిన అధికారి చదువుకు వచ్చాడని తెలిసికొని
పర్మిటెడ్ అని స్టా మ్ప్ వేశాడు. రామకృష్ణయ్య చేతిలో పైసా డబ్బు లేకుండా బ్రిటన్ కు చేరాడు. రామకృష్ణయ్యగారి
అకుంఠితమైన దీక్ష నాకు ఎంతో నచ్చింది. లక్ష్యాన్ని సాధించడానికి పట్టు దల మొక్కవోని దీక్ష అవసరం అని నేను
రామకృష్ణయ్యగారి అనుభవాల నుంచి తెలుసుకున్నాను .
PART- D
సాహిత్య చరిత్ర
5) ఇవ్వబడిన నాలుగు ప్రశ్నలనుండి రెండింటికి నూరు పదాలలో సమాధానమును రాయండి
2X5=10
* కవి జీవితం గురించి 1 మార్కు
* కవి యేవేని రెండు రచనలు అయినా పేరుకొంటే -1 మార్కు
15 0f 23
Page 18
* కవి రాసిన ఒక గ్రంధం నుండి కొన్ని కవితలను లేదా ఒకటి రెండు పద్యాలు ఉదాహరిస్తూ విషయ వివరణ చేస్తే - 3
మార్కులు
* భాషా వ్యాకరణ దోషాలు ఎన్ని ఉన్నా అరమార్కు కన్నా ఎక్కువ తీయరాదు.
i)అల్లసాని కవిత్వం గురించి రాయండి
జవాబు :
అల్లసాని పెద్దన మహాకవి. 15వ మరియు 16వ శతాబ్దా లు ఒక ప్రముఖ తెలుగు కవి మరియు విజయనగర చక్రవర్తి
కృష్ణదేవరాయల సామ్రాజ్య ఆస్థా నంలో అగ్రగామి. అతని మను చరిత్రకు ఇతివృత్తం మార్కండేయ పురాణంలోని ఒక
చిన్న కథ . ఆంధ్ర కవితా పితామహుడని బిరుదు కలదు. ఇతని కవిత్వంలో జిగి బిగి ఉంటుంది. జిగి అనగా
కాంతి,బిగి అనగా పటుత్వం . వీరిగొప్ప పద్యములు... అటజని కాంచె..., అచట పుట్టిన కొమ్మ చివురయినా చేవ ..
ఆ మకరాంక మనోజ్ఞ మూర్తి.. ఇంతటి కన్నులుండ...
ఇవతవీవు భీత హరిణేక్షణ .......
మను చరిత్రకు మరో పేరు "స్వారోచిష మను సంభవము"
ii. శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యాన్ని గురించి వివరించండి
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తు న్నారు.
ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తు తం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన
తల్లితండ్రు లు సింగమ్మ, రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి
జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తు డైనాడని భావిస్తు న్నారు.
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం, శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర
శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి,
ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నాయి
iii) మహాప్రస్థా నము గురించి వివరించండి
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థా నం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థా నానికే
ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థా నానికి ముందు, మహా ప్రస్థా నానికి
తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి.
దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ,
16 0f 23
Page 19
నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా
ప్రస్థా నం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత గుడిపాటి వెంకట
చలం వ్రాసినారు.
తన బాధ ప్రపంచం బాధ -దేవులపల్లిధై తే ప్రపంచము బాధ శ్రీశ్రీది అని చలం పేర్కొన్నాడు. శ్రీశ్రీ అసలు పేరు శ్రీ
రంగం శ్రీనివాస రావు.
తాజ్ మహాల్ కు రాళ్ళెత్తిన కూలీలెవ్వరు... నేను సైతము ప్రపంచాగ్నికి.. జగన్నాథ రథ చక్రా లు.... ఏవి తల్లి నిరుడు
కురిసిన హిమసమూహములు --వంటి కవితలు మహా ప్రస్తా నం లో ప్రతి ఒక్కరికి స్ప్హూర్తి ని ,ప్రేరణను
కలిగిస్తా యి.
మహాప్రస్థా న కవితల రచన మొత్తంగా 1930 దశకంలో జరిగింది. మరీ ముఖ్యంగా 1934కూ 1940కీ నడుమ
వ్రాసినవాటిలో గొప్ప కవితలను ఎంచుకుని 1950లో ప్రచురించారు శ్రీశ్రీ. ఈ కవితలు తెలుగు సాహిత్యంలో
అభ్యుదయ కవిత్వమనే కవితావిప్లవాన్ని సృష్టించడానికి ఒకానొక కారణంగా భావించారు.శ్రీశ్రీ మహాప్రస్థా నాన్ని
విశ్లేషిస్తూ వెలువడిన అనేక వ్యాసాల పరంపరలో అద్దేపల్లి రామమోహనరావు వ్రాసిన శ్రీశ్రీ కవితాప్రస్థా నం
పేర్కొనదగింది."
iv. నిజాంపాలన ను దాశరధి ఎలా ఎదిరించాడు?
జవాబు:
నా తెలంగాణ శతకోటి రత్నాల వీణ.... మా నిజాం రాజు తర తరాల బూజు అన్న దాశరధి అసలు దాశరథి
కృష్ణమాచార్యులు . దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్య
(జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ
రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి
తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి
సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ
ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది. అగ్నిధార,రుద్రవీణ, తిమిరంతో సమరం,పునర్వవమ్,
గాలిబుగీతాలు వీరి రచనలు.
భాగం ఉ - PART-E
సృజనాత్మక రచన
17 0f 23
Page 20
6. a. ఏదేని ఒక దానికి సంభాషణ రాయాలి. 1X6= 6
i. ఇద్దరు స్నేహితులు చార్మినార్ కు సంబంధించిన విశేషాలు మాట్లా డుకోవడం
రాము- మిత్రమా నిన్నటి నుండి నీవు కనబడటం లేదు
సోము- నేను నిన్న చార్మినారే చూడటానికి వెళ్లా ను
రాము- ఓహో! అద్భుత చారిత్రక కట్టడం,హై దరాబాద్ నగర అస్తిత్వానికి నిదర్శనం .దాని గురించి
నీవుతెలుసుకున్నది నీవు నాకు చెప్పవా
సోము - ఇది పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నము. నాలుగు మినార్లు కలిగిన గుమ్మటం .భారత దేశం లో అత్యంత
గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హై దరాబాద్ గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది.ఇది హై దరాబాద్
లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టా డాలలో ఒకటి.
రాము-ఇది ఎపుడు నిర్మించారు
సోము -1591 లో కట్టా రు
రాము- ఇది ఏ శైలిలో నిర్మించడమైనది
సోము-ఇస్లా మైక్ శైలి లో
రాము- దీనికి వాడిన నిర్మాణ సామగ్రి ఎలాంటిది
సోము- గ్రానైట్ లైవ్ స్టోన్ ,మోర్టా ర్,మార్బల్ ను ఉపయోగించారు
రాము- దీని ఎత్తు ,పొడవు ఎంత
సోము -160 ఫీట్ల ఎత్తు ,167 ఫీట్ల పొడవు ఉంటుంది.
రాము-దీనిని ఎవరు నిర్మించారు
సోము- దీనిని మహ్మద్ కూలీ కుతుబ్ సా నిర్మించారు. పై విధంగా పరస్పరం ఇద్దరు వ్యక్తు లు సంభాషించు
కున్నట్లు గా సరళమైన భాషలో ప్రశ్నలు సమాధానాలుగా వచ్చే ధోరణి లో సంభా షణ ఉండాలి.
ii. మాతృ భాషలో చదవటం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థి ఉపాధ్యాయుడు సంభాషించుకోవటం
ఉపాధ్యాయుడు- గోపి ఏమిటి ఈ మధ్య నీవు మాతృభాష అయిన తెలుగుపై నిర్లక్ష్యం చూపు తున్నావు.
గోపి- సర్ ఇంగ్లీషు అంతర్జా తీయ భాష దాన్ని చదివితే, దేశవిదేశాల్లో ఉద్యోగాలు వస్తా యి. సమాజంలో పేరు ప్రతిష్టలు
వస్తా యి.
18 0f 23
Page 21
ఉపాధ్యాయుడు- అది నిజమే కానీ నేను కొన్ని విషయాలు అడుగుతాను చెబుతావా?
విద్యార్థి - చెబుతాను సార్
ఉపాధ్యాయుడు -సంతోషం, దుఃఖం, భయం ఇలాంటి ఉద్వేగాలను ఇతరులతో ఎలా పంచుకుంటావు?
విద్యార్థి - మాతృభాషలో
ఉపాధ్యాయుడు- నేను ఇపుడు ప్రశ్న వేయగానే ఏ భాషలో ఆలోచించావు.
విద్యార్థి -మాతృభాషలో
ఉపాధ్యాయుడు - లోతైన ,గంభీరమైన, శాస్త్ర విషయాలు సిద్ధాంత విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఏ భాషలో
మాట్లా డితే నీకు సులభంగా ఉంటుంది.
విద్యార్థి - మాతృభాషలో
ఉపాధ్యాయుడు స్నేహితులతో కుటుంబ సభ్యులతో మనసువిప్పి ఏ భాషలో మాట్లా డుతావు.
విద్యార్థి- మాతృభాషలో
ఉపాధ్యాయుడు- మరి ఇన్ని ప్రత్యేకతలున్న మాతృభాషను, అమ్మతో సమానమైన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం
మంచిదేనా?
విద్యార్థి- కాదు సర్
ఉపాధ్యాయుడు- మాతృభాషను ప్రేమించు! ఇతర భాషలను గౌరవించు!
విద్యార్థి అలాగే సర్.
భాషకు 1 మా, సంభాషణలకు 4 మా శైలి కి 1 మా
b). అనువదించాలి. 1X6= 6
మక్కీకి మక్కీగా కాకుండ, పేరా మొత్తం చదివి అందులో ఉన్న భా వాన్ని స్వంత భాషలో రాయాలి. కొత్తవి రాయకూడదు.
ఉన్న భావం పోకూడదు. ప్రతి అంశం రావాలి. ఆత్మ చెడకూడదు. అలా రాస్తే 5 మా
* భాషా శైలికి1 మా
అనువాదం-
డాల్ఫిన్లు సముద్రంలో అత్యంత స్నేహపూర్వక జీవులుగా పరిగణించబడుతున్నాయి మరియు రోమన్ కాలాల్లో
మునిగిపోతున్న నావికులకు సహాయం చేసే కథలు సర్వ సాధారణం.
డాల్ఫిన్‌ల గురించి మనం ఎంత ఎక్కువ నేర్చుకున్నామో,వాటి సమాజం, ఈ ప్రజలు ఇంతకు ముందు ఊహించిన
దానికంటే చాలా సంక్లిష్టంగా ఉందని మనం గ్రహిస్తా ము.
19 0f 23
Page 22
డాల్ఫీన్లు మన లాగే గర్భిణీ తల్లు లకు సంరక్షణ కల్పిస్తా యి , అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతర డాల్ఫిన్‌లను చూసుకోవడం
మరియు సమాజంలోని బలహీనులను మనలాగే రక్షించడము వంటివి చేస్తా యి.
కొంతమంది శాస్త్రవేత్తలు డాల్ఫిన్‌లకు ఒక భాష ఉందని సూచించారు, అయితే అవి పదాలు అవసరం లేకుండా ఒకదానితో
ఒకటి సంభాషించుకునే అవకాశం చాలా ఎక్కువ.
ఈ క్షీరదాలలో ఏదైనా మనిషి కంటే ఎక్కువ తెలివైనది కాగలదా?
వాటిపై మనిషి ఆధిపత్యానికి అనుకూలంగా ఉండే అత్యంత సాధారణ వాదనలో, అవి మనలను చంపగలవు అనే దానికంటే
మనం వాటిని సులభంగా చంపగలము అనేది కనీసం సంతృప్తికరంగా ఉంటుంది.
దీనికి భిన్నంగా దేశంలో ఈ అద్భుతమైన జీవుల గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకున్నామో , వాటిని నాశనం
చేసినప్పుడు మనం అంతగా తక్కువగా ఉన్నతంగా కనిపిస్తా ము.
………………………………….
20 0f 23